వేలంలో వారిని కోల్పోయినా.. హ్యాపీగానే ఉన్న సీఎస్కే
- కొందరిని నష్టపోవడం బాధ కలిగించేదే
- కానీ మంచి ప్రతిభ కలిగిన వారిని దక్కించుకున్నాం
- అందులోనూ చాలా తక్కువ ధరకే
- వేలం మంచి ఫలితాలనే ఇచ్చింది
- వెల్లడించిన సీఎస్కే హెడ్ కోచ్ ఫ్లెమింగ్
మెగా వేలంలో సీఎస్కే మొత్తంగా 21 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసింది. ఈ వేలంలో తాము ముగ్గురు చక్కటి ఆటగాళ్లను చాలా తక్కువ ధరకే సొంతం చేసుకున్నట్టు స్టిఫెన్ ఫ్లెమింగ్ చెప్పారు. తాము కీలకమైన కొందరు ఆటగాళ్లను కొనుగోలు చేయలేకపోయినా.. వేలం ఫలితం పట్ల సంతోషంగా ఉన్నట్టు తెలిపారు.
‘‘కొందరు ఆటగాళ్లను నష్టపోయాం. దీని పట్ల కొంత బాధగా ఉంది. కానీ, అసలైన టాలెంట్ ను మేం సంపాదించాం. చక్కటి అనుభవం, యువ ఆటగాళ్ల మంచి సమతూకాన్ని పొందాం. వారు తక్కువ ధరకే మాకు సొంతం అయ్యారు. ఎంతో నైపుణ్యం ఉన్న ఆటగాళ్లు. డెవన్ కాన్వేకు అంతర్జాతీయంగా ఎన్నో ఏళ్ల అనుభవం ఉంది. మిచెల్ శాంటనర్ మాకు స్టాల్ వార్ట్ వంటి వాడు. ఆడమ్ మిల్నే రూపంలో మంచి పేస్ లభించింది. వీరంతా మంచి నైపుణ్యం, ప్రతిభ కలిగినవారు’’అని ఫ్లెమింగ్ వివరించారు.