రేపు వ‌య‌నాడ్‌కు రాహుల్ గాంధీ

rahul gandhi tour in wayanad tomorrow
  • 2019లో అమేథీలో ఓడిన రాహుల్‌
  • వ‌య‌నాడ్‌లో గెలిచిన కాంగ్రెస్ నేత‌
  • ప్ర‌జ‌ల‌తో మ‌మేకం అయ్యేందుకే వెళుతున్నట్టు ప్రకటన   
కాంగ్రెస్ పార్టీ కీల‌క నేత‌, ఆ పార్టీ మాజీ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ బుధ‌వారం నాడు వ‌య‌నాడ్ ప‌ర్య‌ట‌న‌కు వెళుతున్నారు. 2019 ఎన్నిక‌ల్లో త‌న సొంత నియోజ‌కవ‌ర్గం అమేథీతో పాటుగా కేర‌ళ‌కు చెందిన వ‌య‌నాడ్‌లోనూ రాహుల్ గాంధీ బ‌రిలోకి దిగిన సంగ‌తి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ అంచ‌నాలు త‌ల‌కిందులు కాగా.. అమేథీలో ఓడిపోయిన రాహుల్ గాంధీ వ‌య‌నాడ్‌లో మాత్రం గెలిచారు. దీంతో ఎంపీగా ఆయ‌న కొన‌సాగేందుకు వ‌య‌నాడ్ ఆయ‌న‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డింద‌నే చెప్పాలి. 

ఎన్నిక‌లు ముగిసిన త‌ర్వాత అడ‌పాద‌డ‌పా వ‌యనాడ్ ప‌ర్య‌ట‌న‌ల‌కు వెళుతున్న రాహుల్ గాంధీ.. తాజాగా మ‌రోమారు త‌న‌ను గెలిపించిన వ‌య‌నాడ్‌కు వెళుతున్నారు. బుధ‌వారం వ‌య‌నాడ్‌లో రాహుల్ పర్య‌టించ‌నున్నారు. ఈ మేర‌కు రాహుల్ గాంధీ వ‌య‌నాడ్ ప‌ర్య‌ట‌న‌పై కాంగ్రెస్ పార్టీ ఓ ప్ర‌క‌ట‌న చేసింది. వ‌య‌నాడ్ ప్ర‌జ‌ల‌తో మ‌మేకం అయ్యేందుకే రాహుల్ అక్క‌డికి వెళుతున్నార‌ని ఆ పార్టీ ప్ర‌క‌టించింది.
Go Back to Shorts
Rahul Gandhi
wayanad
Congress

More Telugu News