జాన్వీ మార్ఫింగ్ వీడియో: ఇది సిగ్గుచేటైన చర్య అంటూ కుష్బూ ఫైర్
- 'దేవర' సినిమా పాటలో జాన్వీ కపూర్ మార్ఫింగ్ వీడియోపై నటి కుష్బూ ఆగ్రహం
- ఇది క్రూరమైన, అవమానకరమైన చర్య అని, మహిళల గౌరవాన్ని కించపరచడమేనని వ్యాఖ్య
- ఇలాంటివి సృష్టించే, షేర్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్
- జాన్వీకి అండగా నిలుస్తున్నానని, ధైర్యంగా ఉండాలని సూచన
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీని దుర్వినియోగం చేస్తూ నటి జాన్వీ కపూర్‌కు సంబంధించిన మార్ఫింగ్ వీడియోను సృష్టించడంపై సీనియర్ నటి, రాజకీయ నాయకురాలు కుష్బూ సుందర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘దేవర’ సినిమాలోని ‘చుట్టమల్లె’ పాటను మార్ఫింగ్ చేసి వైరల్ చేయడంపై ఆమె మండిపడ్డారు. ఇది వినోదం కాదని, ఒక మహిళ గౌరవానికి భంగం కలిగించే సిగ్గుచేటైన చర్య అని కుష్బూ ఘాటుగా స్పందించారు.
ఈ ఘటనపై తన ఎక్స్ ఖాతాలో కుష్బూ సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. "ఏఐ ద్వారా చేసిన ఈ పని అస్సలు జోక్ కాదు. దీన్ని వినోదంగా గానీ, సాధారణ విషయంగా గానీ చూడకూడదు. ఇది చాలా క్రూరమైన, అవమానకరమైన, సిగ్గుచేటైన చర్య. దీని ద్వారా ఆమె గౌరవాన్ని చించివేశారు" అని ఆవేదన వ్యక్తం చేశారు.
"ఒక మహిళను లక్ష్యంగా చేసుకుని ఇలాంటి మార్ఫింగ్ వీడియోలు సృష్టించడం, వాటిని ప్రచారం చేయడం నన్ను తీవ్రంగా కలచివేసింది. టెక్నాలజీని ఆయుధంగా వాడి తన గౌరవానికి, భద్రతకు భంగం కలిగిస్తారనే భయంతో ఏ మహిళా బతకకూడదు. ఈ రోజు ఇది ఆమెకు జరిగింది, రేపు నాకు, మీకు, మన కూతురికి, సోదరికి, తల్లికి.. మనం ప్రేమించే ఏ మహిళకైనా జరగవచ్చు. బాధితులం మనం కాదు కదా అని మౌనంగా ఉండకూడదు. ఒక మహిళ గౌరవంపై దాడి జరిగినప్పుడు, ప్రతీ మహిళ నిలబడి గొంతు విప్పాలి" అని ఆమె పిలుపునిచ్చారు.
ఇలాంటి కంటెంట్ సృష్టించే వారిని, తెలిసి కూడా వాటిని షేర్ చేసేవారిని, ప్రోత్సహించేవారిని కఠినంగా శిక్షించాలని కుష్బూ డిమాండ్ చేశారు. అప్పుడే ఇతరులకు ఇదొక గుణపాఠంగా మిగులుతుందని అభిప్రాయపడ్డారు. "మహిళ శరీరం వినోద వస్తువు కాదు. ఆమె గౌరవం ఆటబొమ్మ కాదు. ఆమె అవమానం హాస్యాస్పదం కాదు. ఏఐ టెక్నాలజీ ఎప్పటికీ మహిళలపై ఆయుధంగా మారకూడదు. మహిళలంతా ఏకమై 'ఇక చాలు' అని చెప్పాలి" అంటూ ఆమె స్పష్టం చేశారు. చివరగా, "జాన్వీ కపూర్.. నేను నీకు అండగా ఉన్నాను. ధైర్యంగా ఉండు బేటా" అని ఆమెకు భరోసా ఇచ్చారు.
ఇదే విషయంపై శనివారం జూనియర్ ఎన్టీఆర్ కూడా స్పందించి, ఏఐ టెక్నాలజీతో ఫేక్ వీడియోలు సృష్టించే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇలాంటి వాటిని ప్రచారం చేసే వారికి కూడా అవే పరిణామాలు ఉంటాయని స్పష్టం చేశారు. వీరితో పాటు మెగాస్టార్ చిరంజీవి, విజయ్ దేవరకొండ కూడా సోషల్ మీడియా వేదికగా ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు.