Andhra Pradesh: ఏపీలో గత 24 గంటల్లో 76 కరోనా కేసులు

AP records few corona cases in a single day
షార్ట్స్‌లో చూడండి
ఏపీలో కరోనా రోజువారీ కేసులు 100కి లోపే నమోదవుతున్నాయి. గడచిన 24 గంటల్లో 12,916 శాంపిల్స్ పరీక్షించగా, 76 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అనంతపురం జిల్లాలో 19, పశ్చిమ గోదావరి జిల్లాలో 13, గుంటూరు జిల్లాలో 10 కొత్త కేసులు నమోదయ్యాయి. కర్నూలు, శ్రీకాకుళం జిల్లాల్లో కొత్త కేసులేవీ నమోదు కాలేదు. అదే సమయంలో 266 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్తగా మరణాలేవీ సంభవించలేదు. 

రాష్ట్రంలో ఇప్పటివరకు 23,18,338 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా... 23,02,458 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 1,151 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటిదాకా రాష్ట్రంలో 14,729 మంది కరోనాతో మృతి చెందారు.
.
Go Back to Shorts
Andhra Pradesh
Corona Virus
Today Cases
Daily Update

More Telugu News