'భీమ్లా నాయక్' కు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్
- ఐదో షో వేసుకోవడానికి అనుమతి ఇచ్చిన టీఎస్ సర్కార్
- ఈ నెల 25న విడుదల కాబోతున్న 'భీమ్లా నాయక్'
- కాసేపట్లో ప్రారంభం కానున్న ప్రీరిలీజ్ ఈవెంట్
ఈ వార్తతో సినిమా యూనిట్ తో పాటు, పవన్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కాసేపట్లో హైదరాబాద్ యూసుఫ్ గూడలోని పోలీస్ గ్రౌండ్స్ లో ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ జరగబోతోంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి కేటీఆర్, ప్రత్యేక అతిథిగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరుకానున్నారు.