రవితేజ సినిమాలో మెరవనున్న ఇలియానా?
- తెలుగు సినిమాలకి దూరమైన ఇలియానా
- 'రామారావు ఆన్ డ్యూటీ'లో స్పెషల్ సాంగ్
- త్వరలోనే రానున్న క్లారిటీ
అలాంటి ఇలియానా రవితేజ సినిమాలో స్పెషల్ సాంగ్ చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి. రవితేజ హీరోగా 'రామారావు ఆన్ డ్యూటీ' సినిమా రూపొందుతోంది. శరత్ మండవ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో దివ్యాన్ష కౌశిక్ .. రజీషా విజయన్ కథానాయికలుగా అలరించనున్నారు.
ఈ సినిమాలో ఒక మాస్ మసాలా సాంగ్ ఉండటంతో, ఇలియానాతో చేయిస్తే బాగుంటుందని రవితేజ అన్నట్టుగా చెప్పుకుంటున్నారు. రవితేజ - ఇలియానా మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. ఇద్దరి కాంబినేషన్లో నాలుగు సినిమాలు వచ్చాయి. ఆ పరిచయంతోనే ఆయన సిఫార్స్ చేసినట్టుగా టాక్. మరి ఇందులో వాస్తవమెంతన్నది చూడాలి.