త్వరలో ఓటీటీలో 'బిగ్‌బాస్' షురూ.. హౌస్‌లోకి అడుగుపెట్టనున్న మాజీ కంటిస్టెంట్ల పేర్లు లీక్
- ఫిబ్రవరి 20 నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో బిగ్‌బాస్
- హౌస్‌లో అరియానా, ఆదర్శ్, తనీశ్, అఖిల్, అలీ రెజా, హరితేజ
- కొత్తగా వర్షిణి, యాంకర్ శివ, ఢీ-10 విజేత రాజు, టిక్‌టాక్ స్టార్ దుర్గారావు?
గతంలో బిగ్‌బాస్‌లో అలరించిన వారిని కూడా ఈ సారి మళ్లీ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మాజీ కంటెస్టెంట్లను తీసుకున్నారని సమాచారం. వారిలో అరియానా గ్లోరీ కూడా ఉందని తెలుస్తోంది. ఇప్పటికే ఆమెతో బిగ్ బాస్ నిర్వాహకులు ఒప్పందం చేసుకున్నారని ప్రచారం జరుగుతోంది.
ఆమెతో పాటు మాజీ కంటెస్టెంట్స్ ఆదర్శ్, తనీశ్, అఖిల్, అలీ రెజా, హరితేజను కూడా ఈ సారి బిగ్‌బాస్‌లోకి తీసుకోనున్నట్లు తెలుస్తోంది. కొత్తగా బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్న వారిలో యాంకర్ వర్షిణి, యాంకర్ శివ, ఢీ-10 విజేత రాజు, టిక్‌టాక్ స్టార్ దుర్గారావు, సాఫ్ట్‌వేర్ డెవలపర్స్’వెబ్ సిరీస్ ఫేమ్ వైష్ణవి, సోషల్ మీడియా స్టార్ వరంగల్ వందన, యాంకర్ ప్రత్యూష కూడా ఈ సారి బిగ్‌బాస్‌లో అలరించనున్నట్లు సమాచారం.