'సలార్' నుంచి శ్రుతిహాసన్ పోస్టర్ రిలీజ్!
- 'క్రాక్'తో హిట్ అందుకున్న శ్రుతిహాసన్
- 'ఆద్య' పాత్రలో 'సలార్'లో సందడి
- పాన్ ఇండియా సినిమా కావడంతో ఆశలు
- బాలయ్య .. చిరూ ప్రాజెక్టులలో వినిపిస్తున్న పేరు
ప్రభాస్ హీరోగా పాన్ ఇండియా స్థాయిలో నిర్మితమవుతున్న ఈ సినిమాలో శ్రుతి హాసన్ కి ఛాన్స్ దొరకడం నిజంగా ఆమె అదృష్టమే. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదలవుతుంది గనుక, తన కెరియర్ మరింత పుంజుకుంటుందనే బలమైన నమ్మకంతో ఆమె ఉంది. ఈ సినిమా షూటింగులో పాల్గొనడానికి ఉత్సాహాన్ని చూపుతూ వచ్చింది.
ఈ సినిమాలో ఆమె పాత్ర ఎలా ఉండనుంది? ఆమె లుక్ ఎలా ఉండనుంది? అనే ఆసక్తి అందరిలోను ఉంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో ఆమె 'ఆద్య' అనే పాత్రలో కనిపించనుందని చెబుతూ, ఆమె లుక్ కి సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేశారు. దేని గురించో దీర్ఘంగా ఆలోచిస్తున్నట్టుగా ఈ పోస్టర్ లో శ్రుతిహాసన్ కనిపిస్తోంది. ఇక బాలకృష్ణ - గోపీచంద్ మలినేని సినిమాలోను .. చిరంజీవి - బాబీ ప్రాజెక్టులోను నాయికగా ఆమె పేరే వినిపిస్తోంది.