మద్యం మత్తులో దాసరి అరుణ్ కుమార్ వీరంగం.. పలు వాహనాల ధ్వంసం!
- నిన్న రాత్రి బంజారాహిల్స్ సయ్యద్ నగర్ కు వెళ్లిన అరుణ్
- మద్యం మత్తులో రోడ్డు పక్కనున్న వాహనాలను ఢీకొన్న వైనం
- పలు సెక్షన్ల కింద కేసు నమోదు
ఈ ఘటనలో పూర్తిగా ధ్వంసమైన ద్విచక్ర వాహనం యజమాని సయ్యద్ అఫ్జల్ దాసరి అరుణ్ పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో దాసరి అరుణ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. సెక్షన్ 279, 336, మోటారు వాహనాల చట్టంతో పాటు డ్రంకెన్ డ్రైవ్ కింద కేసు బుక్ చేశారు. ఈ కేసు నేపథ్యంలో ఈరోజు ఆయన బంజారాహిల్స్ పోలీసుల ముందు హాజరయ్యారు.