నేను చైతూ గురించి బాధపడితే, చైతూ నా గురించి బాధపడేవాడు: నాగార్జున
- 'బంగార్రాజు'లో కలిసి నటించిన నాగ్, చైతూ
- ప్రమోషన్ ఈవెంట్లతో బిజీ
- ఆసక్తికర అంశాలు వెల్లడించిన నాగ్
నాగచైతన్య ఎక్కడా సహనం కోల్పోలేదని, ఎంతో ప్రశాంతంగా కనిపించాడని నాగ్ వెల్లడించారు. ఎంతో సంయమనంతో వ్యవహరించిన చైతూని చూసి గర్వంగా అనిపించిందని తెలిపారు. కానీ ఓ తండ్రిగా చైతూ పరిస్థితిని చూసి తట్టుకోలేకపోయానని అన్నారు. చైతూ మాత్రం అనుక్షణం నా గురించి బాధపడేవాడు అని నాగార్జున వివరించారు.
కాగా, ఓ ఇంటర్వ్యూలో నాగచైతన్య ఆసక్తికరంగా స్పందించారు. వెండితెరపై మీకు సరైన జోడీ ఎవరని ప్రశ్నించగా, సమంత అని జవాబిచ్చారు. సమంతతో తనకు ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ బాగా కుదురుతుందని వెల్లడించారు.