Vishal: విశాల్ హీరోగా మరో మాస్ యాక్షన్ మూవీ!

Vishal in Adhik Ravichandran Movie
షార్ట్స్‌లో చూడండి
తమిళనాట విశాల్ కి మాస్ యాక్షన్ హీరోగా మంచి క్రేజ్ ఉంది. తన సినిమాలను తమిళంతో పాటు తెలుగులోను రిలీజ్ అయ్యేలా ఆయన చూసుకుంటూ ఉంటాడు. అందువలన ఇక్కడ కూడా విశాల్ కి మంచి క్రేజ్, మార్కెట్ వున్నాయి. ఇటీవల ఆయన నుంచి వచ్చిన 'ఎనిమి' సినిమాకి మంచి ఆదరణ లభించింది.

ఈ నేపథ్యంలో విశాల్ మాస్ కంటెంట్ పుష్కలంగా ఉన్న మరో యాక్షన్ కథకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అధిక్ రవిచంద్రన్ ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నాడు. ఈ సినిమాకి 'మార్క్ ఆంటోని' అనే టైటిల్ ను ఖరారు చేసి ఒక పోస్టర్ ను కూడా వదిలారు. నాటు తుపాకీ పట్టుకుని మాస్ యాంగిల్ లో విశాల్ కనిపిస్తున్నాడు.

కెరియర్ పరంగా విశాల్ కి ఇది 33వ సినిమా. వచ్చేనెల నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలుకానుంది. ఈ లోగా ఈ సినిమాకి సంబంధించిన ఇతర నటీనటుల, సాంకేతిక నిపుణుల వివరాలను వెల్లడించనున్నారు. తమిళంలోనే కాదు తెలుగు, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో కూడా ఈ సినిమాను విడుదల చేయనున్నారు..
Go Back to Shorts
Vishal
Adhik Ravichandran
Mark Antony Movie

More Telugu News