చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు.. దక్షిణ అండమాన్ సముద్రంలో రేపు అల్పపీడనం
- ఉపరితల ఆవర్తన ప్రభావంతో విస్తారంగా వర్షాలు
- మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారుల హెచ్చరిక
- రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాలకు భారీ నుంచి అతి భారీ వర్ష సూచన
అల్పపీడన ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా నేడు, రేపు అక్కడక్కడగా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో ఒకటిరెండు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.
అల్పపీడన ప్రభావంతో తీరం వెండి 30-40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని, కాబట్టి మత్స్యకారులు ఎవరూ సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.