సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

Samantas quote in Insta viral
*  విడాకులు తీసుకున్న తర్వాత కథానాయిక సమంత సోషల్ మీడియాలో ఏ పోస్టు పెట్టినా ఆది వైరల్ అవుతోంది. అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా 'త్వరలో ఓ మంచి జరగనుంది.. గుర్తుంచుకోండి..' అంటూ ఇన్ స్టా స్టోరీస్ లో ఓ కోట్ పెట్టింది. మరి, ఇది దేని గురించి అన్నది అందరిలోనూ కుతూహలాన్ని రేపుతోంది.
*  పవన్ కల్యాణ్, అనిల్ రావిపూడి కాంబినేషన్లో ఓ ఎంటర్ టైనర్ నిర్మాణానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తారు. ప్రస్తుతం చేస్తున్న కథలకు భిన్నంగా, పూర్తి కామెడీ ఎంటర్ టైనర్ స్క్రిప్టును తయారుచేయాల్సిందిగా దర్శకుడు అనిల్ కు పవన్ సూచించినట్టు తెలుస్తోంది.
*  చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. 'వాల్తేర్ వీరయ్య' అనే టైటిల్ని కూడా దీనికోసం పరిశీలిస్తున్నారు. ఇక ఇందులో చిరంజీవికి తమ్ముడిగా హీరో రవితేజ నటించడం దాదాపు ఖరారైందని సమాచారం.    
Go Back to Shorts
Samanta
Pawan Kalyan
Anil Ravipudi
Raviteja

More Telugu News