ఛత్తీస్ గఢ్ లో వింత ఆచారం... కొరడా దెబ్బలు కొట్టించుకున్న ముఖ్యమంత్రి!
- దీపావళి తర్వాత గోవర్ధన పూజ
- పూజలో భాగంగా కొరడా దెబ్బలు
- కొరడాతో కొట్టించుకుంటే విఘ్నాలు తొలగిపోతాయని నమ్మిక
- గతేడాది కూడా పూజలో పాల్గొన్న సీఎం భగేల్
ఆయన గతేడాది కూడా ఈ పూజా కార్యక్రమాలకు విచ్చేశారు. కొరడా దెబ్బలు తింటే దైవ కృప లభిస్తుందన్నది అక్కడి వారి నమ్మకం. తాను కూడా ఈ వింత ఆచారాన్ని నమ్ముతానని సీఎం భగేల్ వెల్లడించారు. రాష్ట్ర ప్రజల క్షేమాన్ని కోరి కొరడా దెబ్బలు తిన్నానని తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తోంది.