'రాధే శ్యామ్' నుంచి పూజ హెగ్డే బర్త్ డే పోస్టర్ రిలీజ్!
- విడుదలకి సిద్ధమైన 'రాధే శ్యామ్'
- ప్రేరణ పాత్రల్లో పూజ అందాల అల్లరి
- కీలకమైన పాత్రలో భాగ్యశ్రీ
- జనవరి 14వ తేదీన విడుదల
సంక్రాంతి కానుకగా జనవరి 14వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. డిసెంబర్ నుంచి ఈ సినిమా ప్రమోషన్స్ ను మొదలుపెట్టనున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ రోజున పూజ హెగ్డే పుట్టినరోజు కావడంతో, ఆమెకి విషెస్ తెలియజేస్తూ .. అదే విధంగా ఆమె పాత్ర పేరు 'ప్రేరణ'ను మరోసారి గుర్తుచేస్తూ స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.
ఈ పోస్టర్ లో పూజ గ్రాండియర్ లుక్ తో కనిపిస్తోంది. ఆమె నాజూకుతనాన్ని ఈ పోస్టర్ అందంగా ఆవిష్కరించింది. ప్రేరణ పాత్ర తన కెరియర్లోనే ప్రత్యేకమైనదని పూజ చెబుతుండటం విశేషం. సీనియర్ బాలీవుడ్ హీరోయిన్ భాగ్యశ్రీ ఒక కీలకమైన పాత్రను పోషించగా, మరో ముఖ్యమైన పాత్రలో కృష్ణంరాజు కనిపించనున్నారు.
.