ఐపీఎల్ క్వాలిఫయర్-1: ఢిల్లీపై టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్
- ఐపీఎల్ లో కీలక దశ ప్రారంభం
- నేడు చెన్నైతో ఢిల్లీ అమీతుమీ
- గెలిచిన జట్టు నేరుగా ఫైనల్స్ చేరిక
- ఓడిన జట్టుకు మరో చాన్స్
- క్వాలిఫయర్-2లో ఎలిమినేటర్ విజేతతో ఆడే అవకాశం
ఇక ఢిల్లీ జట్టులో ఒక మార్పు జరిగింది. రిపల్ పటేల్ స్థానంలో ఆల్ రౌండర్ టామ్ కరన్ జట్టులోకి వచ్చాడని ఆ జట్టు సారథి రిషబ్ పంత్ వెల్లడించాడు. టాస్ గెలిస్తే తాము కూడా బౌలింగ్ ఎంచుకునేవాళ్లమని తెలిపాడు.
కాగా, ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్స్ చేరుతుంది. ఓడిన జట్టుకు మరో అవకాశం ఉంటుంది. ఎలిమినేటర్ మ్యాచ్ లో గెలిచిన జట్టుతో క్వాలిఫయర్-2 మ్యాచ్ లో తలపడుతుంది. అందులో గెలిచిన జట్టు ఫైనల్స్ కు వెళుతుంది.