దేశంలో 20 వేల‌ దిగువ‌కు చేరిన రోజువారీ క‌రోనా కేసులు

India reports 19740 new cases in the last 24 hours
  • నిన్న 19,740  క‌రోనా కేసులు
  • 206 రోజుల క‌నిష్ఠానికి యాక్టివ్ కేసుల సంఖ్య
  • మొత్తం రిక‌వ‌రీల సంఖ్య‌ 3,32,48,291
దేశంలో రోజువారీ క‌రోనా కేసులు 20 వేల‌ దిగువ‌కు చేరాయి. నిన్న 19,740 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. యాక్టివ్ కేసుల సంఖ్య 206 రోజుల క‌నిష్ఠానికి చేరింది. ప్ర‌స్తుతం 2,36,643 మంది ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్ల‌లో చికిత్స పొందుతున్నారు.

నిన్న 23,070 మంది క‌రోనా నుంచి కోలుకున్నారు. మొత్తం రిక‌వ‌రీల సంఖ్య‌ 3,32,48,291కు పెరిగింది. రోజువారీ పాజిటివిటీ రేటు 1.56 శాతంగా ఉంది. దేశ వ్యాప్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు 58.13 కోట్ల క‌రోనా టెస్టులు చేశారు.
Go Back to Shorts
Corona Virus
COVID19
India

More Telugu News