పవన్-పోసాని వివాదం: తనను లాగుతూ తన పేరుతో ట్వీట్లు చేస్తున్నారని మండిపడ్డ హైపర్ ఆది
- పోసానిపై సామాజిక మాధ్యమాల్లో కొందరు అనుచిత వ్యాఖ్యలు
- తనకు ట్విట్టర్ ఖాతా లేదని చెప్పిన హైపర్ ఆది
- సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తానని స్పష్టం
దీనిపై హైపర్ ఆది తాజాగా స్పందించాడు. అటువంటి వారిపై తాను సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తానని హైపర్ ఆది ఫేస్‌బుక్ ద్వారా హెచ్చరించాడు. తనకు ట్విట్టర్ ఖాతా లేదని ఆయన స్పష్టం చేశాడు. తన పేరిట చేస్తోన్న ట్వీట్లను నమ్మవద్దని కోరాడు. తాను ఏదైనా చెప్పాలనుకుంటే ఫేస్‌బుక్ లోని తన అధికారిక ఖాతా ద్వారా వీడియో రూపంలోనే చెబుతానని అన్నారు.