ఆర్సీబీ దూకుడుకు అడ్డుకట్ట వేసిన చెన్నై బౌలర్లు
- షార్జాలో చెన్నై వర్సెస్ బెంగళూరు
- మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు
- 20 ఓవర్లలో 6 వికెట్లకు 156 రన్స్
- అర్ధసెంచరీలు సాధించిన పడిక్కల్, కోహ్లీ
- శుభారంభాన్ని సద్వినియోగం చేసుకోలేని వైనం
కోహ్లీ, పడిక్కల్ అవుటైన తర్వాత వచ్చిన బ్యాట్స్ మెన్ ఎవరూ అదే ఊపు కొనసాగించలేకపోయారు. డివిలియర్స్ 12, మ్యాక్స్ వెల్ 11, టిమ్ డేవిడ్ 1, హర్షల్ పటేల్ 3 పరుగులు చేసి పెవిలియన్ చేరారు. చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లలో డ్వేన్ బ్రావో 3, శార్దూల్ ఠాకూర్ 2, దీపక్ చహర్ ఓ వికెట్ తీశారు. రవీంద్ర జడేజా వికెట్లు తీయకపోయినా, బెంగళూరు పరుగుల ప్రవాహాన్ని నిలువరించాడు.