బంగాళాఖాతంలో వాయుగుండం... ఏపీలో మోస్తరు నుంచి భారీ వర్షాలు
- తూర్పు మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం
- ఈ రాత్రికి వాయుగుండంగా మారే అవకాశం
- కోస్తాంధ్రలో మూడ్రోజుల పాటు వర్షాలు
- ఆదివారం కొన్నిచోట్ల అతి భారీ వర్షాలు
- మత్స్యకారులకు హెచ్చరిక
దీని ప్రభావంతో కోస్తాంధ్రలో మూడ్రోజుల పాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని పేర్కొన్నారు. ఆదివారం నాడు అక్కడక్కడ అతి భారీ వర్షాలు పడతాయని తెలిపారు. అదే సమయంలో వాయవ్య-పశ్చిమ బంగాళాఖాతం, పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఏపీ తీర ప్రాంతాల్లో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, సముద్రం అలజడిగా ఉండడం వల్ల మత్స్యకారులు సోమవారం వేటకు వెళ్లరాదని హెచ్చరించారు.