తాలిబన్ల దారుణం.. కుటుంబసభ్యుల ముందే గర్భిణి కాల్చివేత
- ఆరు నెలల గర్భిణిని కాల్చి చంపిన తాలిబన్లు
- బుర్ఖా ధరించలేదని కాల్చివేత
- మళ్లీ మొదలైన తాలిబన్ల కర్కశత్వాలు
గతంలో తాలిబన్లు పాలన కొనసాగించినప్పుడు మహిళలపై దారుణమైన ఆంక్షలు విధించారు. ముఖం దగ్గర నుంచి పాదాల వరకు ఏ శరీర భాగం కనపడకుండా మహిళలు బుర్ఖాలు ధరించేవారు. అయితే, గత రెండు దశాబ్దాలుగా వారు పూర్తి స్వేచ్ఛను అనుభవిస్తున్నారు. ఇప్పుడు మళ్లీ తాలిబన్ల పాలన రావడంతో పాత పరిస్థితులు మళ్లీ మొదలయ్యాయి. గర్భిణి అని కూడా చూడకుండా సదరు మహిళను అత్యంత కిరాతకంగా చంపేయడం అందరినీ షాక్ కు గురి చేస్తోంది.