కాబూల్ విమానాశ్రయం వద్ద భారీ పేలుడు... 11 మంది దుర్మరణం
- ఉగ్రదాడి జరగొచ్చని హెచ్చరించిన అమెరికా
- అమెరికా హెచ్చరికను సమర్థించిన బ్రిటన్, ఆస్ట్రేలియా
- హెచ్చరిక నిజమైన వైనం
- పేలుడుపై బైడెన్ కు సమాచారం అందించిన పెంటగాన్
ఇది ఆత్మాహుతి దాడేనని అమెరికా రక్షణశాఖ భావిస్తోంది. ప్రాణనష్టం, తదితర వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు పెంటగాన్ వర్గాలు వెల్లడించాయి. పేలుడు ఘటనపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కు రక్షణశాఖ వర్గాలు సమాచారం అందించాయి. కాగా, ఈ ఘటనలో ముగ్గురు అమెరికా సైనికులు, అనేకమంది ఆఫ్ఘన్ పౌరులు గాయపడినట్టు తెలుస్తోంది.
