ఈ వీడియో చూస్తే జీవితంలో పానీపూరీ తినలేరు!
- మూత్రాన్ని పానీలో కలిపిన పానీపూరీవాలా
- సైలెంట్ గా వీడియో తీసిన ఒక వ్యక్తి
- పానీపూరీవాలాను అరెస్ట్ చేసిన పోలీసులు
పానీపూరీ అమ్మే ఒక వ్యక్తి తన మూత్రాన్ని ఒక మగ్గులో పట్టి మసాలా నీటిలో కలిపేశాడు. తనను ఎవరూ చూడటం లేదని అతను అనుకున్నాడు. అయితే ఓ వ్యక్తి మాత్రం సైలెంట్ గా ఈ ఘటనను తన ఫోన్ లో బంధించాడు. ఆ తర్వాత దాన్ని సోషల్ మీడియాలో పెట్టాడు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. తన మూత్రాన్ని పానీలో కలపడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ వీడియోను చూస్తున్నవారంతా పానీపూరీ వ్యక్తిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొందరు అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో, అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు.