దిశా చట్టం పేరుతో ఎన్నాళ్లు మోసం చేస్తారు?... చర్చకు సిద్ధమా?: గౌతు శిరీష
- ఏపీ ప్రభుత్వంపై ధ్వజమెత్తిన గౌతు శిరీష
- మహిళలకు రక్షణ లేకుండా పోయిందని విమర్శలు
- జగన్ పాలనలో దాడులు పెరిగాయని ఆరోపణ
- బాధిత కుటుంబాలకు ఏం న్యాయం జరిగిందన్న శిరీష
మృగాళ్ల బారినపడిన మహిళల కుటుంబాలతో మాట్లాడేందుకు సీఎం జగన్ కు తీరికలేదా? అని నిలదీశారు. రమ్యశ్రీ కుటుంబ సభ్యులను ప్రలోభపెడితే న్యాయం జరగదు అని శిరీష వ్యాఖ్యానించారు. జగన్ రెండేళ్ల పాలనలో మహిళలపై దాడులు పెరిగాయని ఆమె విమర్శించారు. ఇప్పటివరకు బాధిత కుటుంబాలకు ఏం న్యాయం జరిగిందో చెప్పాలని నిలదీశారు.