'ఇక్క‌డ మనీతో పాటు మ‌న‌సులు కూడా గెలుచుకోవ‌చ్చు' అంటోన్న ఎన్టీఆర్.. 'ఎవ‌రు మీలో కోటీశ్వ‌రుడు' ప్రోమో విడుద‌ల‌

Evaru Meelo Koteeswarulu  Roaring this August
  •  షోకి హోస్టుగా ఎన్టీఆర్‌
  •  రండి గెలుద్దాం అంటోన్న‌ ఎన్టీఆర్
  •  ఈ నెల నుంచే షో ప్రారంభం  
గ‌తంలో నాగార్జున‌, చిరంజీవి  'మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు' అంటూ జెమినీ టీవీ షోలో అల‌రించిన విష‌యం తెలిసిందే. ఈసారి ఈ షో జెమినీ టీవీలో 'ఎవ‌రు మీలో కోటీశ్వ‌రుడు' పేరుతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది. 'రండి గెలుద్దాం... ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు' అంటూ యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ డైలాగు చెప్పిన తొలి ప్రోమో కూడా ఇప్ప‌టికే విడుద‌లైంది. ఈ రోజు ఈ షో నుంచి మ‌రో ప్రోమో విడుద‌ల చేశారు.

'ఇక్క‌డ మనీతో పాటు మ‌న‌సులు కూడా గెలుచుకోవ‌చ్చు' అంటూ ఈ కొత్త ప్రోమోలో ఎన్టీఆర్ మ‌రో డైలాగు చెప్పాడు. ఇక్కడ 'కల మీది కథ మీది. ఆట నాది, కోటి మీది' అంటూ ఎన్టీఆర్ ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రిస్తున్నాడు. ఈ ఆగ‌స్టులోనే ఈ షో గ‌ర్జిస్తుంద‌ని జెమినీ టీవీ పేర్కొంది. గ‌తంలో ఎన్టీఆర్‌ బిగ్ బాస్ సీజ‌న్ 1లోనూ వ్యాఖ్యాతగా వ్య‌వ‌హ‌రించాడు. ఇప్పుడు 'ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు' ప్రోగ్రాంతో మ‌రోసారి అల‌రించ‌డానికి సిద్ధ‌మ‌య్యాడు.

 
             

Go Back to Shorts
Evaru Meelo Koteeswarulu
Junior NTR
gemini
tv

More Telugu News