ఓటీటీ రిలీజ్ అనగానే చాలా బాధపడ్డాను: 'నారప్ప' డైరెక్టర్!
- 'నారప్ప' కోసం ఎంతో కష్టపడ్డాను
- పెద్దగా మార్పులు చేయలేదు
- రెండు రోజులు నిద్రపట్టలేదు
- పరిస్థితులు అర్థం చేసుకున్నాను
'నారప్ప' యాక్షన్ మూవీ అని చాలామంది అనుకుంటారు .. కానీ ఆ యాక్షన్ అంతా కూడా ఎమోషన్ చుట్టూ తిరుగుతుంది. నేటివిటీకి తగినట్టుగా చిన్నచిన్న మార్పులను మాత్రమే చేశాను. ఒరిజనల్లో ఉన్న సున్నితమైన భావోద్వేగాలను ఎంతమాత్రం కదిలించే ప్రయత్నాలు చేయలేదు. ఈ సినిమాను ఒక ఛాలెంజింగ్ గా భావించి చేశాను. 60 రోజుల్లోనే ఈ సినిమా షూటింగును పూర్తి చేశాము. ఒక భారీ సినిమాకు ఎంతలా కష్టపడతామో, ఈ సినిమాకి ఆ విధంగానే కష్టపడ్డాను. ఈ సినిమా ఓటీటీకి వెళుతుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఆ విషయం తెలిసిన తరువాత నాకు చాలా బాధకలిగింది .. రెండు రోజుల పాటు నిద్రపట్టలేదు. ఆ తరువాత ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులను అర్థం చేసుకుని నాకు నేను సర్దిచెప్పుకున్నాను" అని అన్నాడు.