"ధర్మస్థలి తలుపులు మళ్లీ తెరుచుకున్నాయి"... చిరంజీవి 'ఆచార్య' షూటింగ్ పునఃప్రారంభం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

"ధర్మస్థలి తలుపులు మళ్లీ తెరుచుకున్నాయి"... చిరంజీవి 'ఆచార్య' షూటింగ్ పునఃప్రారంభం

Acharya entered into final schedule
  • చిరు, కొరటాల కాంబోలో 'ఆచార్య'
  • కరోనా కారణంగా ఇటీవల నిలిచిపోయిన షూటింగ్
  • ఆఖరి షెడ్యూల్లోకి ఎంటరయ్యామని తాజా ప్రకటన
  • త్వరలో కీలక అప్ డేట్లు అంటూ ట్వీట్
మెగాస్టార్ చిరంజీవి, హిట్ దర్శకుడు కొరటల శివ కాంబినేషన్ లో వస్తున్న 'ఆచార్య' చిత్రం ఆఖరి షెడ్యూల్ లో అడుగుపెట్టింది. ఇటీవల కరోనా సెకండ్ వేవ్ కారణంగా నిలిచిపోయిన 'ఆచార్య' షూటింగ్ మళ్లీ ప్రారంభమైందని చిత్ర నిర్మాణ సంస్థ కొణిదెల ప్రొ కంపెనీ వెల్లడించింది. "ధర్మస్థలి తలుపులు మళ్లీ తెరుచుకున్నాయి" అంటూ ట్వీట్ చేసింది. అందరినీ అలరించేలా త్వరలోనే 'ఆచార్య' నుంచి అప్ డేట్లు రానున్నాయని తెలిపింది.

సామాజిక ఇతివృత్తంతో తెరకెక్కుతున్న 'ఆచార్య' చిత్రంలో రామ్ చరణ్ కూడా నటిస్తున్నారు. కొణిదెల ప్రొ కంపెనీ సమర్పణలో మ్యాట్నీ ఎంటర్టయిన్ మెంట్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ సినిమాలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ కథానాయిక. రామ్ చరణ్ సరసన పూజ హెగ్డే నటిస్తోంది. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.
Acharya
Final Schedule
Shooting
Chiranjeevi
Koratala Siva
Ramcharan
Tollywood

More Telugu News