'కిరాతక' కథ నచ్చిందంటున్న పాయల్!
- వీరభద్రం నుంచి 'కిరాతక'
- థ్రిల్లర్ నేపథ్యంలో సాగే కథ
- నిర్మాతగా తిరుపతి రెడ్డి
- ఆగస్టు 13 నుంచి షూటింగ్
ఆది సాయికుమార్ జోడీగా ఆమె 'కిరాతక' సినిమాలో అవకాశాన్ని దక్కించుకుంది. తాజాగా ఆమె ఈ సినిమాను గురించి మాట్లాడుతూ .. " ఈ మధ్య కాలంలో నేను చాలా కథలు విన్నాను .. కానీ అవేవీ నాకు పెద్దగా నచ్చలేదు. దర్శకుడు వీరభద్రం గారు థ్రిల్లర్ నేపథ్యంలో సాగే ఈ కథను చెప్పారు. నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. అందుకే సింగిల్ సిట్టింగ్ లోనే నేను ఓకే చెప్పేశాను. ఈ సినిమా నా కెరియర్ కి చాలా హెల్ప్ అవుతుందని అనిపిస్తోంది" అంటూ చెప్పుకొచ్చింది. తిరుపతి రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా, ఆగస్టు 13వ తేదీ నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది.