డెల్టా వేరియంట్ పై పోరు దిశగా ఆస్ట్రేలియాలో మళ్లీ మొదలైన లాక్ డౌన్!
- పెరుగుతున్న డెల్టా వేరియంట్
- సిడ్నీలో ఒక్క రోజులో 150 కేసులు
- డార్విన్, పెర్త్ లోనూ లాక్ డౌన్ అమలు
పశ్చిమ ఆస్ట్రేలియా రాజధాని పెర్త్ తో పాటు డార్విన్, క్వీన్స్ లాండ్ లో సైతం నాలుగు రోజుల పూర్తిస్థాయి లాక్ డౌన్ ను అమలు చేయాలని నిర్ణయించారు. పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారకముందే త్వరితగతిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని, మరింతగా శ్రమిస్తేనే కేసుల సంఖ్య పెరగకుండా చూడవచ్చని క్వీన్స్ లాండ్ ప్రీమియర్ అనాస్టాసియా తెలియజేశారు.