ఢిల్లీలో ఒక నీతి.. తెలంగాణలో మరో నీతా?: కాంగ్రెస్‌పై కిషన్ రెడ్డి ఆగ్రహం

ఢిల్లీలో ఒక నీతి.. తెలంగాణలో మరో నీతా?: కాంగ్రెస్‌పై కిషన్ రెడ్డి ఆగ్రహం

One policy in Delhi another in Telangana Kishan Reddy slams Congress
  • ప్రజాస్వామ్య హక్కులపై కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందన్న కిషన్ రెడ్డి
  • ఢిల్లీలో కాంగ్రెస్ నిరసనలను అడ్డుకోవడం లేదన్న కేంద్ర మంత్రి
  • తెలంగాణలో బీజేపీ నేతలను గృహ నిర్బంధం చేస్తున్నారని ఆరోపణ
ప్రజాస్వామ్య హక్కుల విషయంలో కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. ఢిల్లీలో కాంగ్రెస్ నేతలు స్వేచ్ఛగా నిరసనలు చేస్తుంటే అనుమతిస్తున్నామని, కానీ కాంగ్రెస్ అధికారంలో ఉన్న తెలంగాణలో మాత్రం బీజేపీ నేతల నిరసనలను ఉక్కుపాదంతో అణచివేస్తున్నారని ఆయన ఆరోపించారు.

తెలంగాణలో రైతుల సమస్యలు, పోలీసు నియామకాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల వంటి ప్రజా సమస్యలపై నిరసన తెలిపేందుకు ప్రయత్నిస్తే, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావుతో సహా పలువురు నేతలను గృహ నిర్బంధం చేస్తున్నారని మండిపడ్డారు. రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా పర్యటిస్తూ ప్రధాని మోదీని, ఎన్నికల సంఘాన్ని, న్యాయవ్యవస్థను, సైన్యాన్ని విమర్శిస్తున్నా ఆయన హక్కులను కేంద్ర ప్రభుత్వం ఎన్నడూ అడ్డుకోలేదని స్పష్టం చేశారు.

ఢిల్లీలో కాంగ్రెస్ నేతలకు ఉన్న ప్రజాస్వామ్య హక్కులు... తెలంగాణలోని బీజేపీ నేతలకు ఎందుకు ఉండవు? అని ఆయన సూటిగా ప్రశ్నించారు. చేతిలో రాజ్యాంగం పట్టుకుంటే సరిపోదని, అధికారంలో ఉన్నప్పుడు దానిని ఆచరించాలని హితవు పలికారు. 1975లో ఎమర్జెన్సీ విధించి ప్రతిపక్ష నేతలను జైళ్లలో పెట్టిన చరిత్ర కాంగ్రెస్‌దని ఆయన గుర్తుచేశారు.
Advertisement
Kishan Reddy
Congress Party
Telangana BJP
Democratic Rights
Rahul Gandhi
Telangana Politics

More Telugu News