థియేటర్లలో దిగడానికి రెడీ అవుతున్న 'పాగల్'
- విష్వక్సేన్ నుంచి 'పాగల్'
- కరోనా కారణంగా రిలీజ్ ఆలస్యం
- త్వరలోనే థియేటర్లకు
- సంగీత దర్శకుడిగా రధన్
అయితే ఇప్పుడు వచ్చే నెల నుంచి థియేటర్లు ఓపెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయనే వార్తలు వస్తున్నాయి. అలా థియేటర్లు ఓపెన్ అయితే, ముందుగా ప్రేక్షకులను పలకరించే సినిమాల జాబితాలో 'పాగల్' ఉంటుందని అంటున్నారు. ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పుకుంటున్నారు. థియేటర్లు తెరుచుకున్న కొన్ని రోజులకు ఈ విషయంలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ సినిమాతో తప్పకుండా హిట్ కొడతాననే నమ్మకంతో విష్వక్ సేన్ ఉన్నాడు. ఆయన నమ్మకాన్ని ఈ సినిమా ఎంతవరకూ నిలబెడుతుందో చూడాలి మరి.