ప్రయాణికులు లేక రైళ్లు వెలవెల... రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే

South Central Railway cancels trains
దేశంలో కరోనా వ్యాప్తి ఇంకా కొనసాగుతుండడంతో ప్రజలు రైళ్లలో ప్రయాణాలకు వెనుకంజ వేస్తున్నారు. రాష్ట్రాల్లో లాక్ డౌన్లు కొనసాగుతుండడం కూడా ప్రయాణికుల తగ్గుదలకు కారణం. ఈ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే పరిధిలో జూన్ 1 నుంచి 16వ తేదీ వరకు పలు రైళ్లను రద్దు చేశారు. ప్రయాణికులు లేక రైళ్లు వెలవెల పోతుండడంతో దక్షిణ మధ్య రైల్వే ఈ నిర్ణయం తీసుకుంది. ప్రయాణికులు ఈ మార్పును గమనించాలని, ప్రజలకు కలిగే అసౌకర్యం పట్ల చింతిస్తున్నామని పేర్కొంది.

రద్దు చేసిన రైళ్ల వివరాలు...

  • గూడూరు-విజయవాడ
  • విజయవాడ-గూడూరు
  • గుంటూరు-వికారాబాద్
  • వికారాబాద్-గుంటూరు
  • విజయవాడ-సికింద్రాబాద్
  • సికింద్రాబాద్-విజయవాడ
  • బీదర్-హైదరాబాద్
  • సికింద్రాబాద్-బీదర్
  • సిర్పూర్ కాగజ్ నగర్-సికింద్రాబాద్
  • సికింద్రాబాద్-సిర్పూర్ కాగజ్ నగర్
  • నర్సాపూర్-నిడదవోలు
  • నిడదవోలు-నర్సాపూర్
  • కాచిగూడ-గుంటూరు
  • గుంటూరు-కాచిగూడ
  • ఆదిలాబాద్-హెచ్ఎస్ నాందేడ్
  • హెచ్ఎస్ నాందేడ్-ఆదిలాబాద్
  • పర్బని-హెచ్ఎస్ నాందేడ్
  • చెన్నై సెంట్రల్-తిరుపతి
  • తిరుపతి-చెన్నై సెంట్రల్
  • విజయవాడ-చెన్నై సెంట్రల్
  • చెన్నై సెంట్రల్-విజయవాడ
Go Back to Shorts
South Central Railway
Trains
Cancellation
Corona Pandemic
Second Wave
Andhra Pradesh
Telangana
Maharashtra
Karnataka

More Telugu News