తెలుగు తెరకి మరో నట వారసురాలు!
- నిన్నటి తరం హీరోయిన్ గా వాణీ విశ్వనాథ్
- ఆమె బాటలోనే వర్ష విశ్వనాథ్
- ఒకేసారి మూడు సినిమాల్లో అవకాశాలు
అలాంటి ఆమె వారసురాలిగా వర్ష విశ్వనాథ్ పరిచయమవుతోంది. ఆల్రెడీ తమిళంలో ఓ మూడు సినిమాలు చేసిన ఈ పిల్ల, తెలుగులోనూ మూడు సినిమాలను లైన్లో పెట్టేసింది. ఒక సినిమాలో ఆమె సంగీత దర్శకుడు కోటి తనయుడు రాజీవ్ సాలూరి జోడీగా నటిస్తోంది. ఈ ఏడాదిలోనే ఈ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ప్రస్తుతం టాలీవుడ్లో కొత్త హీరోయిన్ల మధ్య గట్టిపోటీ ఉంది. ఈ పోటీని తట్టుకుని ఈ అమ్మాయి ఇక్కడ ఎంతవరకూ నిలబడుతుందో చూడాలి.