'మిస్టర్ ఇండియా' మెడలిస్ట్ జగదీశ్ లాడ్ కరోనాతో మృతి
- వడోదరలోని ఓ ఆసుపత్రిలో మృతి చెందిన జగదీశ్ లాడ్
- గత నాలుగు రోజులుగా ఆక్సిజన్ సపోర్ట్ తో ఉన్న బాడీ బిల్డర్
- కెరీర్ లో ఎన్నో విజయాలను సాధించిన జగదీశ్
ఎన్నో బాడీ బిల్డింగ్ పోటీల్లో ఆయన తన స్వరాష్ట్రం మహారాష్ట్రతో పాటు, ఇండియాకు ప్రాతినిథ్యం వహించారు. మిస్టర్ ఇండియా పోటీల్లో ఆయన కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు. ప్రపంచ బాడీ బిల్డింగ్ పోటీల్లో కూడా సిల్వర్ మెడల్ సాధించారు. తన కెరీర్ లో ఎన్నో విజయాలను సాధించారు. ఆయన మరణం పట్ల బాడీ బిల్డర్లందరూ సంతాపం ప్రకటిస్తున్నారు.