'నారప్ప' రిలీజ్ డేట్ వాయిదా!
- తమిళంలో హిట్ కొట్టిన 'అసురన్'
- ఓ పేద రైతు చుట్టూ తిరిగే కథ
- మంజూ వారియర్ పాత్రలో ప్రియమణి
తమిళంలో ధనుశ్ కి హిట్ తో పాటు ప్రశంసలను కూడా తెచ్చిపెట్టిన 'అసురన్' సినిమాకి ఇది రీమేక్. తమకి గల కొద్దిపాటి భూమిని నమ్ముకుని కథనాయకుడి కుటుంబం బ్రతుకుతూ ఉంటుంది. ఆ భూమిని అన్యాయంగా సొంతం చేసుకోవడానికి ఒక అవినీతిపరుడు ప్రయత్నిస్తాడు. రాజకీయపరమైన అండదండలతో ఆ రైతు కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేయాలనుకుంటాడు. అప్పుడు కథానాయకుడు ఏం చేస్తాడు? పర్యవసానంగా జరిగేదేమిటి? అనేదే కథ. తమిళంలో మంజూ వారియర్ చేసిన పాత్రలో తెలుగులో ప్రియమణి కనిపించనుంది.