సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

Saranga Dharia song reaches another milestone
  • 'సారంగ ధరియా' పాట మరో రికార్డు 
  • నాని సినిమాకి వస్తున్న భారీ ఆఫర్లు
  • మణిరత్నం షూటింగ్ కూడా వాయిదా    
*  శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న 'లవ్ స్టోరీ' సినిమాలో సాయిపల్లవి డ్యాన్స్ చేసిన 'సారంగ ధరియా' పాట సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 28న యూ ట్యూబ్ లో రిలీజ్ చేసిన ఈ పాట ఇప్పటికి 150 మిలియన్ వ్యూస్ ను, 1.2 మిలియన్ లైకులను సాధించి మరో మైలురాయిని చేరుకుంది.
*  నాని హీరోగా రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో రూపొందుతున్న 'శ్యామ్ సింగరాయ్' చిత్రానికి బిజినెస్ వర్గాల నుంచి మంచి ఆఫర్లు వస్తున్నాయట. ఈ చిత్రం నాన్ థియేట్రికల్ హక్కులకు (డిజిటల్, శాటిలైట్ హక్కులు) సుమారు 30 కోట్లు ఆఫర్ వస్తున్నట్టు చెబుతున్నారు. కోల్ కతా బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రాన్ని 50 కోట్ల బడ్జెట్టుతో నిర్మిస్తున్నారు.
*  ప్రముఖ దర్శకుడు మణిరత్నం రూపొందిస్తున్న చారిత్రాత్మక చిత్రం 'పొన్నియన్ సెల్వన్' షూటింగ్ వాయిదా పడింది. వాస్తవానికి మే నెల నుంచి తదుపరి షెడ్యూలు నిర్వహించాలి. అయితే, కరోనా విజృంభణ నేపథ్యంలో జూన్ కి వాయిదా వేసినట్టు  సమాచారం. ఇందులో ఐశ్వర్య రాయ్, త్రిష, విక్రమ్, కార్తీ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.  
Sai Pallavi
Shekhar Kammula
Nani
Maniratnam

More Telugu News