మహారాష్ట్రలో కొనసాగుతున్న కరోనా బీభత్సం... ఒక్కరోజులో 30 వేలకు పైగా కొత్త కేసులు
- మహారాష్ట్రలో కరోనా స్వైరవిహారం
- ఇప్పటికీ అదుపులోకి రాని మహమ్మారి
- దేశంలోకెల్లా అత్యధిక కేసులు మహారాష్ట్రలోనే!
- గత 24 గంటల్లో 31,643 మందికి పాజిటివ్
- 102 మంది మృతి
మహారాష్ట్రలో గడచిన 24 గంటల్లో 31,643 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 102 మంది మృత్యువాత పడ్డారు. కరోనా నుంచి కోలుకున్న 20,854 మందిని డిశ్చార్జి చేశారు. మహారాష్ట్రలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 27,45,518కి పెరిగింది. ఇప్పటివరకు 23,53,307 మంది కోలుకున్నారు. ఇంకా 3,36,584 మంది చికిత్స పొందుతున్నారు. మొత్తం మరణాల సంఖ్య 54,283కి చేరింది.