తిరుపతి ఉప ఎన్నికల్లో ఓటమిని విపక్షాలు ముందే అంగీకరించాయా?: విజయసాయిరెడ్డి
- వాలంటీర్ వ్యవస్థపై సర్వత్రా ప్రశంసలు
- అలాంటి వారిపై పడి ఏడవడం మానుకోవాలి
- ఎన్నికల్లో ఓడిపోయాక ఆ నిందను వారిపై మోపాలని ఫిక్సయ్యారా?
'ప్రభుత్వ సేవలను ప్రజలకు అందించడంలో అంతర్జాతీయ ప్రశంసలు అందుకుంటోంది జగన్ గారు పెట్టిన వాలంటీర్ వ్యవస్థ. అలాంటి అనుసంధానకర్తలపై పడి ఏడవడం మానుకోవాలి. తిరుపతి ఉపఎన్నికల్లో ఓటమిని విపక్షాలు ముందే అంగీకరించాయా? లేదా ఓడిపోయాక ఆ నిందను వాలంటీర్లపై మోపాలని ఫిక్సయ్యారా?' అని విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు.