MS Dhoni: ధోనీ సన్యాసి అవతారం గుట్టు వీడింది... వీడియో ఇదిగో!

  • సోషల్ మీడియాలో వైరల్ గా ధోనీ కొత్త అవతారం
  • సన్యాసి వేషంలో ధోనీని చూసి అభిమానుల షాక్
  • ఐపీఎల్ ప్రోమో వీడియోలో సన్యాసిగా కనిపించిన ధోనీ
  • ఐపీఎల్ ప్రాశస్త్యం గురించి శిష్యులకు బోధన
  • ఆకట్టుకుంటున్న వీడియో
IPL new season promo video featuring MS Dhoni

క్రికెట్ దిగ్గజం మహేంద్ర సింగ్ ధోనీ ఓ సన్యాసి వేషంలో కనిపించిన ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుండగా, తమ ఆరాధ్య క్రికెటర్ ధోనీని బౌద్ధ భిక్షువు తరహాలో చూసిన అభిమానులు ఆశ్చర్యపోయారు. అయితే, ధోనీ గెటప్పు వెనుక అసలు కథేంటో ఇప్పుడు వెల్లడైంది. ఏప్రిల్ 9 నుంచి ఐపీఎల్ 14వ సీజన్ షురూ అవుతున్న నేపథ్యంలో టోర్నీ ప్రసారకర్త స్టార్ స్పోర్ట్స్, టోర్నీ స్పాన్సర్ వివో, ఐపీఎల్ యాజమాన్యం ఓ ప్రోమో వీడియో రూపొందించాయి.

ఐపీఎల్ విశిష్టతను, రోహిత్ శర్మ వంటి అత్యధిక ఐపీఎల్ టోర్నీ విజయాలు అందుకున్న కెప్టెన్ గురించి సన్యాసి వేషంలో ఉన్న ధోనీ... తన శిష్యులకు వివరించడాన్ని ఈ వీడియోలో చూడొచ్చు. మొత్తమ్మీద తనదైన కూల్ నెస్ తో ధోనీ ఈ యాడ్ ను రక్తికట్టించాడనే చెప్పాలి. ఇంకెందుకాలస్యం... ఈ వీడియోను  మీరూ చూసేయండి!

More Telugu News