చంద్రబాబు ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకోవాలి: రోజా
- జగన్ ఏం పీకాడని చంద్రబాబు అన్నారు
- కుప్పం ప్రజలు చంద్రబాబును పీకేశారు
- కేవలం 14 చోట్ల మాత్రమే టీడీపీ మద్దతుదారులు గెలుపొందారు
కుప్పం నియోజకవర్గంలో మొత్తం 93 పంచాయతీలు ఉండగా... వాటిలో 4 మినహా 89 పంచాయతీల్లో ఎన్నికలు జరిగాయని... వాటిలో 74 స్థానాల్లో వైసీపీ మద్దతుదారులు సర్పంచులుగా గెలుపొందారని తెలిపారు. కేవలం 14 చోట్ల మాత్రమే టీడీపీ మద్దతుదారులు గెలుపొందారని చెప్పారు.
1989 నుంచి కుప్పం నియోజకవర్గానికి చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్నారని రోజా గుర్తుచేశారు. మూడు దశాబ్దాలకు పైగా టీడీపీ ఆధిపత్యం ప్రదర్శిస్తున్న చోట... ఇప్పుడు వైసీపీ జెండా ఎగిరిందని చెప్పారు. మనవడితో ఆడుకోవడానికి చంద్రబాబును కుప్పం ప్రజలు ఇంటికి పంపించేశారని ఎద్దేవా చేశారు. జగన్ ఏం పీకాడని అన్న చంద్రబాబు ఇప్పటికైనా నోటిని అదుపులో పెట్టుకోవాలని అన్నారు.