బోయిన్ పల్లి పీఎస్‌కు ఏపీ మాజీ మంత్రి అఖిలప్రియ!
- కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితురాలిగా అఖిల ప్రియ
- పోలీస్ స్టేషన్ కు వచ్చి రెండోసారి సంతకం
- కోర్టు ఆదేశాలతో విచారణకు సహకరిస్తున్నామన్న అఖిల
కాగా, బోయిన్‌ప్లలి అపహరణ కేసులో ప్రధాన నిందితురాలుగా ఉన్న భూమా అఖిలప్రియ 15 రోజుల క్రితం కూడా పోలీస్ స్టేషన్ కు హాజరై ఏసీపీ నరేశ్ రెడ్డి సమక్షంలో సంతకం చేసిన విషయం తెలిసిందే. ప్రతి 15 రోజులకోసారి పీఎస్‌కు హాజరై సంతకం చేయాలని సికింద్రాబాద్ కోర్టు ఆమెకు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఆమె ఆ మేరకు నడుచుకుంటున్నారు.