బెంగళూరు నుంచి హైదరాబాద్ చేరుకున్న వైఎస్ షర్మిల... రేపు మరో కీలక భేటీ!
Add ap7am to your home Screen

బెంగళూరు నుంచి హైదరాబాద్ చేరుకున్న వైఎస్ షర్మిల... రేపు మరో కీలక భేటీ!

YS Sharmila arrives Hyderabad from Bengaluru
  • తెలంగాణలో కొత్త పార్టీకి షర్మిల సన్నాహాలు
  • ఇటీవల లోటస్ పాండ్ లో సమావేశం
  • ఈసారి హైదరాబాద్, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాల నేతలతో సమావేశం
  • ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ తో ఖమ్మం జిల్లా పర్యటన వాయిదా
తెలంగాణలో పార్టీ ప్రారంభించేందుకు ఉత్సాహంగా ఉన్న వైఎస్ షర్మిల ఆ దిశగా తన కార్యాచరణ వేగవంతం చేశారు. ఇటీవలే హైదరాబాదు లోటస్ పాండ్ లో వైఎస్సార్ అభిమానులు, సన్నిహితులతో సమావేశమై తన మనోభావాలను వారితో పంచుకున్న షర్మిల మరో సమావేశానికి సిద్ధమయ్యారు. ఆమె ఈ సాయంత్రం బెంగళూరు నుంచి హైదరాబాద్ వచ్చారు. రేపు హైదరాబాద్, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాల నేతలతో సమావేశం నిర్వహించనున్నారు. ఈ భేటీకి కూడా లోటస్ పాండ్ నివాసం వేదిక కానుంది. అటు, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా షర్మిల ఖమ్మం పర్యటన వాయిదా పడింది.
Sharmila
Hyderabad
Bengaluru
Political Party
Telangana

More Telugu News