బారిస్టర్ చదివిన అసదుద్దీన్ ఒవైసీకి ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలియదా?: రాజా సింగ్
- లోక్ సభలో తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఒవైసీ
- హైదరాబాద్ ను యూటీ చేస్తారంటూ వ్యాఖ్యలు
- అసద్ వ్యాఖ్యలను ఖండించిన రాజా సింగ్
- ఒవైసీకి బుద్ధి లేదంటూ ఆగ్రహం
- విభేదాలు సృష్టించేలా మాట్లాడుతుంటాడని వెల్లడి
అసలు, అసదుద్దీన్ ఒవైసీకి బుద్ధి ఉందా లేదా? ఏ సమయంలో ఏం మాట్లాడాలో తెలియదా? అని మండిపడ్డారు. బారిస్టర్ చదివినప్పటికీ అసదుద్దీన్ ఒవైసీకి జ్ఞానం రాలేదని ఎద్దేవా చేశారు. పార్లమెంటులో కేంద్ర పాలిత ప్రాంతాలపై చర్చ లేకుండానే ఒవైసీ ఈ వ్యాఖ్యలు చేశాడని, ఎప్పుడు నోరు విప్పినా విభేదాలు సృష్టించేలా మాట్లాడుతుంటాడని రాజాసింగ్ అన్నారు. మీడియాలో అందరూ తన గురించే మాట్లాడుకోవాలన్న అల్పబుద్ధితో వ్యాఖ్యలు చేస్తుంటాడని విమర్శించారు.