Advertisement

బెంగళూరు బస్సులో మహిళకు వేధింపులు.. వ్యక్తిని చితకబాదిన డ్రైవర్, ప్రయాణికులు

BMTC Bus woman harassed in Bengaluru as driver and passengers catch accused
  • బెంగళూరు బీఎంటీసీ బస్సులో మహిళకు లైంగిక వేధింపులు
  • మాన్యతా టెక్ పార్క్ వద్ద శుక్రవారం జరిగిన ఘటన
  • నిందితుడు పారిపోకుండా డోర్లు మూసివేసిన డ్రైవర్
  • ఇతర ప్రయాణికులతో కలిసి నిందితుడిని పట్టుకున్న డ్రైవర్
బెంగళూరులో కదులుతున్న బీఎంటీసీ బస్సులో ఓ మహిళకు లైంగిక వేధింపులు ఎదురయ్యాయి. తోటి ప్రయాణికుడు అసభ్యంగా ప్రవర్తించడంతో ఆమె ధైర్యంగా అతడిని నిలదీశారు. ఆ వ్యక్తి అక్కడి నుంచి పరారయ్యేందుకు ప్రయత్నించగా, బస్సు డ్రైవర్, ఇతర ప్రయాణికులు సమయస్ఫూర్తితో వ్యవహరించి అతడిని అడ్డుకుని పట్టుకున్నారు. ఐటీ కారిడార్‌లోని మాన్యతా టెక్ పార్క్ సమీపంలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

శుక్రవారం బీఎంటీసీ బస్సులో ప్రయాణిస్తున్న సమయంలో ఓ వ్యక్తి సదరు మహిళ పట్ల అమర్యాదగా ప్రవర్తించి, అసభ్యంగా తాకాడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఆమె తక్షణమే స్పందించి ఆ వ్యక్తిని నిలదీసి చెంప చెళ్లుమనిపించారు. పట్టుబడతాననే భయంతో అతడు వెంటనే బస్సు దిగి పారిపోయేందుకు యత్నించాడు.

దీనిని గమనించిన బస్సు డ్రైవర్ అప్రమత్తమై వెంటనే తలుపులు మూసివేశారు. ఈ క్రమంలో ఆ వ్యక్తి తన చొక్కా విప్పి మహిళను భయపెట్టాలని చూసినప్పటికీ, డ్రైవర్ మరియు తోటి ప్రయాణికులు అతడిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. ఈ ఘటనపై సంపిగేహళ్లి పోలీసులు దృష్టి సారించారు. వైరల్ వీడియో ఆధారంగా పోలీసులు, బీఎంటీసీ అధికారులు పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.
Advertisement
BMTC Bus
Bengaluru woman harassment
Manyata Tech Park
BMTC bus driver
Sampigehalli police
Bengaluru viral video

More Telugu News