సమాధిలోని శవాన్ని తీసి బతికించాలనుకున్నారు: నిమ్మగడ్డపై రోజా విమర్శలు
- 2019లోనే టీడీపీని ప్రజలు సమాధి చేశారు
- చంద్రబాబుతో శభాష్ అనిపించుకోవాలని నిమ్మగడ్డ అనుకున్నారు
- నిమ్మగడ్డ ఆటలకు ఫుల్ స్టాప్ పడింది
రిటైర్ అయ్యే లోపల టీడీపీ అధినేత చంద్రబాబుతో శభాష్ అనిపించుకోవాలని నిమ్మగడ్డ అనుకున్నారని... కానీ, జనాలు ఆయనకు బుద్ధి చెప్పారని అన్నారు. నిమ్మగడ్డ ఆటలకు ఫుల్ స్టాప్ పడిందని చెప్పారు. నగరి నియోజకవర్గ ప్రజలకు తాను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానని... రెండు సార్లు తనను గెలిపించి అసెంబ్లీకి పంపించారని, ఇప్పుడు తొలిసారి తాను ఎదుర్కొన్న పంచాయతీ ఎన్నికలలో కూడా వైసీపీకి ఘన విజయాన్ని కట్టబెట్టారని అన్నారు.