Gehana Vashisht: టాలీవుడ్ నటి గెహనా వశిష్ట్ ను అరెస్ట్ చేసిన క్రైమ్ బ్రాంచ్ పోలీసులు.... కారణం ఇదే!

Mumbai crime branch police arrests actress Gehana Vashisht
  • అశ్లీల చిత్రాల రూపకల్పనలో గెహనా పాత్ర
  • వెబ్ సైట్లలోకి వీడియోలు అప్ లోడ్
  • గెహనా వెబ్ సైట్లో 87 వీడియోలు
  • పక్కా సమాచారంతో దాడులు చేసిన ముంబయి పోలీసులు
టాలీవుడ్ లో పలు చిత్రాల్లో నటించిన ఉత్తరాది భామ గెహనా వశిష్ట్ ను ముంబయి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అశ్లీల చిత్రాలను రూపొందిస్తూ, ఆ వీడియోలను పోర్న్ వెబ్ సైట్లలో అప్ లోడ్ చేస్తోందన్న ఆరోపణలపై ముంబయి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు గెహనా వశిష్ట్ ను అదుపులోకి తీసుకున్నారు. తన వీడియోలను సబ్ స్క్రైబ్ చేసుకోవాలంటే రూ.2 వేలు చెల్లించాల్సి ఉంటుందని గెహనా రేటు ఫిక్స్ చేసినట్టు సమాచారం. పోర్న్ వీడియోలు రూపొందించడం, వాటిని వెబ్ సైట్లలోకి అప్ లోడ్ చేయడంలో ఈ హీరోయిన్ పాత్ర ఉందని పోలీసులు నమ్ముతున్నారు. ఆమెను నేడు కోర్టులో హాజరుపర్చుతారని తెలుస్తోంది.

గెహనా తెలుగులో బీ టెక్ లవ్ స్టోరీ, ప్రేమించు పెళ్లాడు, అనుకున్నదొకటి అయ్యిందొకటి, నమస్తే వంటి చిత్రాల్లో నటించింది. అంతేకాదు, ఆపరేషన్ ధుర్యోధన వంటి పలు చిత్రాల్లో ఐటమ్ సాంగ్స్ లోనూ తళుక్కుమంది. మోడల్ గానూ పలు అసైన్ మెంట్లు చేసింది.

కాగా, పోర్న్ వీడియోల వ్యవహారంలో గెహనాతో పాటు మరికొందరిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమెకు సంబంధించిన వెబ్ సైట్లో 87 వరకు అశ్లీల వీడియోలు ఉన్నట్టు గుర్తించారు. ముంబయి, మలద్ ప్రాంతాల్లోని ఓ బంగ్లాలో చిత్రీకరణ జరుగుతోందన్న పక్కా సమాచారంతో పోలీసులు దాడి చేసి ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు.
Gehana Vashisht
Arrest
Police
Mumbai
Tollywood

More Telugu News