ఏమయ్యా కొరటాలా... టీజర్ ఎప్పుడు రిలీజ్ చేస్తావంటూ చిరంజీవి... రేపు ప్రకటన చేస్తాను సార్ అంటూ కొరటాల... ఆసక్తికర సంభాషణ
- కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి ఆచార్య
- టీజర్ ఇంకెప్పుడంటూ 'చిరు'కోపం
- ఉదయం 10 గంటలకు ప్రకటిస్తాను సార్ అంటూ కొరటాల జవాబు
- ట్విట్టర్ లో సంభాషణను పంచుకున్న చిరంజీవి
ఆ సంభాషణ ఎలా సాగిందంటే...
చిరంజీవి: ఏమయ్యా కొరటాలా... ఆచార్య టీజర్ న్యూ ఇయర్ కి లేదు, సంక్రాంతికి లేదు, ఇంకెప్పుడు..?
కొరటాల: సార్, అదే పనిలో ఉన్నా!
చిరంజీవి: ఎప్పుడో చెప్పకపోతే లీక్ చేయడానికి రెడీగా ఉన్నా!
కొరటాల: రేపు ఉదయాన్నే అనౌన్స్ మెంట్ ఇచ్చేస్తాను సార్!
చిరంజీవి: ఇస్తావుగా..!
కొరటాల: అనౌన్స్ మెంట్ రేపు ఉదయం 10 గంటలకు ఫిక్స్ సార్!
ఈ సంభాషణను చిరంజీవి స్వయంగా తన ట్విట్టర్ అకౌంట్ లో పంచుకున్నారు.