తొలి టీకా వేయించుకున్న ఇజ్రాయెల్ ప్రధాని.. భయాందోళనలను పటాపంచలు చేసిన నెతన్యాహు!

Benjamin Netanyahu receives coronavirus vaccine
  • ఇజ్రాయెల్‌కు అందిన నాలుగు మిలియన్ టీకా డోసులు
  • టీకా వేయించుకున్న తొలి ఇజ్రాయెలీగా నెతన్యాహు రికార్డు
  • ప్రజల్లోని భయాందోళనలు పారదోలిన ప్రధాని
ఇజ్రాయెల్‌లో అధికారికంగా నిన్న కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభమైంది. ఫైజర్-బయోఎన్‌టెక్ అభివృద్ధి చేసిన టీకా డోసులు నాలుగు మిలియన్లు ఇజ్రాయెల్ ప్రభుత్వానికి అందాయి. వీటితో దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆ దేశ ప్రధానమంత్రి బెంజిమన్ నెతన్యాహు తొలి టీకా వేయించుకున్నారు. ఫలితంగా టీకా తీసుకున్న తొలి ఇజ్రాయెలీగా ఆయన రికార్డులకెక్కారు. అంతేకాదు, టీకా వేయించుకోవడం ద్వారా వ్యాక్సిన్‌పై ప్రజల్లో ఉన్న భయాందోళనలను పారదోలే ప్రయత్నం చేశారు.

ఈ సందర్భంగా నెతన్యాహు మాట్లాడుతూ చిన్న ఇంజెక్షన్ ద్వారా ఎంతోమంది ఆరోగ్యాలను రక్షించవచ్చన్నారు. దీనిని పెద్ద ముందడుగుగా అభివర్ణించారు. ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ వేయించుకోవాలని పిలుపునిచ్చారు. కాగా, ఇప్పటి వరకు ఇజ్రాయెల్ వ్యాప్తంగా 3.72 లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి. 3,070 మంది ప్రాణాలు కోల్పోయారు.
Go Back to Shorts
Israel
Prime Minister
Benjamin Netanyahu
Corona vaccine

More Telugu News