ఆర్టీసీ సమ్మె... నర్సంపేటలో నిప్పంటించుకున్న బస్సు డ్రైవర్
- రెండో రోజుకు చేరుకున్న ఆర్టీసీ సమ్మె
- నర్సంపేట డిపోలో డ్రైవర్గా పనిచేస్తున్న శంకర్ గౌడ్
- ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం లేదంటూ నిప్పంటించుకున్న డ్రైవర్
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారని గుర్తు చేశారు. కానీ ప్రభుత్వంలో విలీనం చేయకుండా కాలయాపన చేస్తున్నారని ఆరోపిస్తూ, బస్టాండ్ ఎదుట ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తీవ్రంగా గాయపడిన అతడిని వరంగల్లోని ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.