చర్చలను స్వాగతిస్తాం కానీ..: డొనాల్డ్ ట్రంప్‌కు ఇరాన్ అధ్యక్షుడి కౌంటర్
- ఎక్స్ వేదికగా ట్వీట్ చేసిన మసూద్ పెజెష్కియాన్
- చర్చలను, ఒప్పందాలను స్వాగతిస్తామని వెల్లడి
- వాగ్ధానాల ఉల్లంఘన సహించేది లేదని స్పష్టీకరణ
- అమెరికా మాటలకు, చేతలకు పొంతన లేదన్న పెజెష్కియాన్
మాట తప్పడం, దిగ్బంధనాలకు పాల్పడటం, బెదిరింపులకు గురి చేయడం వంటివి చర్చలకు అడ్డంకిగా మారుతాయని పేర్కొన్నారు. అమెరికా చెబుతున్న మాటలకు, చేతలకు ఎక్కడా పొంతన లేదని అన్నారు. మీ కపటమైన డొల్ల మాటల తీరును ప్రపంచం గమనిస్తోందని అన్నారు.
ఒకవైపు చర్చలు, సంప్రదింపులు అంటూనే మరోవైపు అమెరికా ఇరాన్ ఓడరేవులను దిగ్బంధిస్తోంది. హర్మూజ్ జలసంధి వద్ద బలగాలని మోహరించింది. ఇంకోవైపు, ఇరాన్ హర్మూజ్ జలసంధిని మూసివేస్తోంది. చర్చల ప్రతిపాదనలు వస్తున్నప్పటికీ, దాడులు, దిగ్బంధాలు కొనసాగుతుండటంతో కొలిక్కి రావడం లేదు.